కుమార్ సానూ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కుమార్ సానూ
కుమార్ సానూ
కుమార్ సానూ దిద్దిన చిత్రం.
వ్యక్తిగత సమాచారం
జన్మ నామంకేదార్నాథ్ భట్టాచార్య
జననం (1957-09-23) 1957 సెప్టెంబరు 23 (వయసు 67)
కోల్కతా, పశ్చిమ బెంగాల్, భారతదేశం
మూలంముంబై, మహారాష్ట్ర, భారతదేశం
సంగీత శైలినేపథ్య గాయకుడు
వృత్తిగాయకవృత్తి, సంగీత దర్శకుడు
వాయిద్యాలుతబలా
క్రియాశీల కాలం1984–ప్రస్తుతం
లేబుళ్ళుసోనీ మ్యూజిక్, టి-సిరీస్, టిప్స్, సరేగమ, వీనస్ రికార్డ్ & టేప్స్

కుమార్ సానూ గా ప్రసిద్ధికెక్కిన 'కేదార్ నాథ్ భట్టాచార్జీ' (1990 నుంచి 1995 వరకు) వరుసగా 5 సంవత్సరాలు ఫిలింఫేర్ బహుమతులు గెలుచుకున్న ఒక ప్రముఖ భారతీయ గాయకుడు. ఈయన కలకత్తాలో 1957 సెప్టెంబరు 23 న జన్మించారు. 2009 లో భారత ప్రభుత్వం ఈయనకు పద్మశ్రీ పురస్కారాన్ని అందజేసింది. [1]

తొలి దశ

[మార్చు]
పద్మశ్రీపురస్కారం

కుమార్ సానూ బెంగాళీ కుళీన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. ఈయన తండ్రి పసుపతి భట్టాచార్య గాత్రసంగీత విద్వాంసుడు, సంగీతకర్త. ఈయన చిన్నప్పటి నుండే సానూకు గాత్రంలో, తబలాలో శిక్షణ ఇచ్చాడు. కలకత్తా విశ్వవిద్యాలయం నుండి వాణిజ్యశాస్త్రంలో డిగ్రీ పూర్తిచేసి సానూ 1979లో సంగీత ప్రదర్శనలు ఇవ్వటం ప్రారంభించి అనేక షోలలో, రెస్టారెంట్లలో ప్రదర్శనలిచ్చాడు. ఈయన తన గాత్ర శైలిలో కిషోర్ కుమార్ను అనుకరించే ప్రయత్నం చేసేవాడు.[2] ఆ తర్వాత దశలో, తనదైన ప్రత్యేక శైలిని వృద్ధిచేసుకున్నాడు.[2]

వృత్తి విశేషాలు

[మార్చు]

1984 లో పాటలు పాడడం మొదలుపెట్టిన కుమార్ సానూకు ఆషికీ హిందీ చిత్రం (1990) ద్వారా మంచి గుర్తింపు వచ్చింది.

సంప్రతింపులు

[మార్చు]
  1. "Kumar Sanu biography". Retrieved 2012-09-21.
  2. 2.0 2.1 "Detailed biography of Kumar Sanu". Retrieved 11 November 2011.

Other websites

[మార్చు]